2.పరమాత్మ - అర్జునుడు ఒకరికొకరు అపరిచితులు

కురుక్షేత్రము
కురుక్షేత్రము అంటే ఒక పవిత్ర స్థలము లేక పుణ్యక్షేత్రము. దీనికి ధర్మక్షేత్రము అనే మరొక పేరు కూడా ఉంది. ధరాన్ని పునఃస్థాపించడానికి ప్రమాత్ముడు, జీవాత్ముని (ప్రవక్త అర్జునుని)తో మొదటిసారిగా కలసిన ప్రదేశము, శ్రీ పరమాత్ముని చేత ధర్మం బోధించబడింది కాబట్టి ఇది ధర్మక్షేత్రం అనబడుతుంది.
(కురుక్షేత్రమునకు మరొక అర్ధం కురు=చేయు, క్షేత్రము=స్థలము. ముఖ్యంగా దీని అంతరార్ధం కర్మలను ఆచరించు స్థానముగా ఈ ప్రపంచమునకు వర్తిస్తుంది.)

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధర్మం బోధించిన స్థలం కురుక్షేత్రం - గీత 1:1

కురుక్షేత్రం లేక ధర్మక్షేత్రంలో శ్రీ పరమాత్ముడు తన మొదటి కలయిక (యోగము)లో అర్జునునికి ఏవిధంగా కనిపించాడో ఈక్రింది శ్లోకము తెలుపుతుంది. శ్రీ పరమాత్ముని చూసి అర్జునుడు ఇలా అడిగాడు.

ఆఖ్యాహి మేకో భావానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద
విజ్ఞాతుమిచ్చామి భవన్తమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్.
దేవోత్తమా! భయంకరాకారముగల మీరెవరో నాకు చెప్పుడు. ఏలయనగా మీ ప్రవృత్తిని ఎరుంగకున్నాను. మీకు నమస్కారము. నన్ననుగ్రహింపుడు. -గీత 11:31

శ్లోకము 11:31 లోని "భయంకరాకారము గల నీవు" అనే మాటలను బట్టి శ్రీ పరమాత్ముడు బహుశా నాలుగు చేతులు కలిగి ఉన్న ఒక అసాధారణ మానవరూపంలో అర్జునునికి కనిపించాడు. ఆ ఆకారాన్ని మొదటిసారి చూసినప్పుడు అర్జునుడు మనస్సులో కాస్తంత భయంతో తడబడ్డాడు. క్రింది శ్లోకం ఆ విషయాన్ని బహిర్గతం చేస్తుంది.

కిరీటినం గదినం చక్రహస్త మిచ్చామి త్వాం ద్రష్టుమహం తధైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భావ విశ్వమూర్తే.
నేను మిమ్మల్ని మునపటివలెనే కిరీటము, గదా, చక్రము చేత ధరించిన వానిగ జూడలంచుచున్నాను. అనేక హస్తములుగలవాడా! జగద్రూపా! నాలుగు భుజములు గల ఆ పూర్వరూపమునే మరల ధరింపుడు. - గీత 11:46

శ్రీ పరమాత్ముని విశ్వరూపం ఎక్కువసేపు చూడలేకపోయిన అర్జునుడు మరల వెనుకటి నాలుగు చేతులతో కూడిన రూపాన్నే చూపమని శ్రీ పరమాత్ముని వేడుకున్నాడు. నాలుగు చేతులు కలిగియున్న ఈ ఆకారము మొదటి చూపులో కాస్త భయం కలిగించేదిగా ఉన్నా, విశ్వరూపమంత భయంకరంగా లేదు కానీ ఒక విధమైన ఆనందానుభూతిని కలిగించింది. కనుక ఆ ఆకారాన్ని మరల చూడాలనే కోరిక అర్జునునికి అతి స్పష్టంగా కనిపించి ఉంటాడు. తాను (పరమాత్ముడు) సాధారణ మనిషిని కానని మానవజాతికి అతీతుడనే విషయాన్ని అర్జునుని మనస్సుపై ముద్రవేసి అతనిని విశ్వసింపజేయడానికి అలా చూపడం జరిగింది.

1.నీవు ఎవరు? 2.నీవు నిర్వర్తించవలసిన కార్యమేమిటి? (నీ ప్రవృత్తి ఏమిటి?)

పై రెండు ప్రశ్నలు శ్రీ పరమాత్మునితో అర్జునునికి ఇంతకుపూర్వం పరిచయం లేదని ఈ అసాధారణ రూపంలోనే అర్జునునితో సమావేశం అవడం ఇదే ప్రధమమనే విషయాన్ని తెలుపుతోంది. ఇంకా ఈ అసాధారణ రూపం కలవాడు వాస్తవానికి ఎవరై ఉంటాడు? ఇతడు నిర్వర్తించే కార్యమేమిటి? అనే విషయాలు తెలుసుకోవాలనే కోరిక అర్జునుని మనస్సులో కలిగినట్లు స్పష్టం అవుతుంది.

పరమాత్మ ప్రవక్త ముహమ్మద్ వారిని కలిశాడు.

జీబ్రయీల్ (గాబ్రియేల్)ను ముహమ్మద్ ప్రవక్త మొదటిసారి చూసినప్పుడు ఆయనకు ఇంచుమించు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాంతి పర్వతం (జబలే నూర్)పై జిబ్రయీల్ వారు ఈ అసాధారణ రూపంలోనే ముహమ్మద్ ప్రవక్తకు మొదట దర్శనమిచ్చాడు. హిందూ ధార్మిక గ్రంధాలలో జిబ్రయీల్ కు పేర్కొన్న పేరు పరమాత్ముడు. కాంతి పర్వతంపై జిబ్రయీల్ అసాధారణ రూపంలో ముహమ్మద్ ప్రవక్త వారిని ఉద్దేశించి తన అధికారికమైన స్వరంలో ఇలా ఆదేశించాడు:

పఠించు సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు, నీ ప్రభువు పరమ దయాళువు. ఆయన కలామ్ ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. - ఖురాన్ 96:1-5

అప్పటికి ముహమ్మద్ వారు ప్రవక్తగా ఇంకా నియుక్తులు కాలేదు. ఆయన నివాస ప్రాంతం నుండి దూరంగా కాంతికొండ (జబలెనూర్) వద్దకు పోయి ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేసుకునేవారు.

ధర్మం ప్రప్రపధంగా కురుక్షేత్రంలో బోధింపబడుట చేత అది ధర్మక్షేత్రంగా పిలువబడింది. అదే విధంగా మొదటిసారి దైవసందేశం ఇక్కడినుండే రావడం మొదలయింది. ఈ కాంతిపర్వతం వద్దనే పరమాత్ముడు*, ప్రవక్త ముహమ్మద్ కు దర్శనమిచ్చి ఆయన (ముహమ్మద్) పై దైవ సందేశాన్ని అవతరింపజేసాడు. కాబట్టి ఈ పర్వతము జబలెనూర్ (కాంతిపర్వతం)గా పిలువబడింది. ఈ జబలెనూర్ నుండే అపురూప దైవ సందేశ కిరణాలు వెలువడి, అంధకారంలో కొత్తిమిట్టాడుతున్న ప్రపంచమంతా వెదజల్లబడ్డాయి. కురుక్షేత్రంలో అర్జునుడివలే, "నీవు ఎవరవు?, నీ కార్యమేమిటి? అనే ప్రశ్నలు వేయనప్పటికీ, ఆ అపరిచిత ఆకారారపు దర్శనమేమిటో ఆయన ఇవ్వబోయే సందేశమేమిటో అని ముహమ్మద్ ప్రవక్త తీవ్రంగా కలవరపడ్డారు.
.......................................
పరమాత్ముడు* : ఖురాన్ ప్రకారంగా రూహుల్ ఖుద్దుస్ అని అతని బిరుదు. రూహ్ + ఖుద్దూస్ = రూహుల్ ఖుద్దుస్.
రూహ్ = ఆత్మ, ఖుద్దుస్ = ప్రవిత్రమైన. పవిత్రమైనటువంటి ఆత్మ = పరమాత్మ, (ఖురాన్ 5:110, 2:87) ఖురాన్ లో ఆయనకు మరొక బిరుదు ఉన్నది. అది "రూహుల్ అమీన్" అనగా విశ్వననీయమైన ఆత్మ అని అర్ధం (ఖురాన్ 26:193).
Share:
spacer

No comments:

Post a Comment