శ్రీ పరమాత్ముడు "అక్షర" జీవరాశికి చెందినవాడు

ముందు గడిచిన శ్లోకం 4:6లో తన గూర్చి శ్రీ పరమాత్ముడు చెప్పుకున్న విధంగా శ్రీ పరమాత్ముని ప్రత్యేక గుణాలు నాలుగు వర్ణించబడ్డాయి. సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునిలోనూ ఈ గుణాలు ఉన్నాయి. కానీ అతడు (పరమాత్ముడు) సర్వేశ్వరుడు కాదు. అయితే స్వర్గలోకాల నుండి దిగి వచ్చిన ఈ పరమాత్ముడు ఎవరు? అనే సంశయం సహజంగా అందరికీ కలుగుతుంది. ఈశ్వరునిలో ఉన్న కొన్ని గుణాలు కలిగి యున్నట్లు కనిపిస్తున్న ఈ అస్తిత్వం ఎవరిది? అనే సందేహ నివృత్తికై మీ దృష్టిని ఈ క్రింది శ్లోకాల వైపు సారించమనవి. గీతా ప్రకారం జీవులలో రెండు తరగతులను మనము చూడగలము. అందులో ఒకటి నశించే గుణము కలవి అంటే భూమిపై జన్మించిన సమస్త జీవరాశులు ఈ కోవకు చెందుతాయి. ఇక రెండవది స్వర్గలోకాలకు చెందిన సమస్త జీవరాశులు మరియు ఆత్మలు (SPIRITS) ఇవి నశింపు లేనివి.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే.
ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహములు క్షరులనియు, కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు. - గీతా 15:16

ప్రపంచములో రెండు రకాల జీవులున్నాయి.అవి నశించేవి (క్షరములు), నశింపనివి (అక్షరములు) మార్పులు చెందకుండా స్థిరముగా ఉండే తమతమ అసలు ఆకారము కలిగి ఉండేవి.

జీవులలో నశించిపోయే గుణము గల జీవులన్నీ ఒక తరగతికి చెందినవి మరియు మార్పులు చెందకుండా స్థిరంగా వారి సహజ ఆకారంలో ఉండేవి రెండవ తరగతికి చెందినవి. జీవరాశి రెండు తరగతులుగా విభజించబడింది. సర్వశక్తి సంపన్నుడైన ఈశ్వరుడు భూమిపై మానవజాతిని సృష్టించాడు అంతేకాక, పరలోకాల్లో విలసిల్లే మరొక జాతి జీవులను కూడా సృష్టించాడని, వారు మానవుల లక్షణాలకు విరుద్దమైన గుణాలు కలిగి ఉంటారనే విషయం దీని ద్వారా స్పష్టించాడని, వారు మానవుల లక్షణాలకు విరుద్దమైన గుణాలు కలిగిఉంటారనే విషయం దీని ద్వారా స్పష్టమయ్యింది. వీరిని గురించి పై శ్లోకంలో చెప్పినట్లు తమ ఆకార స్వరూపాలలో ఎటువంటి మార్పులు చెందకుండా స్థిరంగా ఉంటారని మరియు వీరికి నాశనము (చావు) లేదని గ్రహించాలి. ఈ రెండు ప్రకృతి సిద్దమైన గుణాలు వీరిని జన్మరహితులనడానికి సాక్షాధారాలుగా ఉన్నాయి. కాబట్టి అర్జునుని ముందు భయంకర స్వరూపంలో కనబడి "నేను చావు పుట్టుకలు లేని వాడను" అని పరిచయం చేసుకున్నవానినే సర్వేశ్వరుడు అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ 15:16 శ్లోకంలో వర్ణించినట్లు అతను చావుపుట్టుక లేకుండా సృష్టింపబడిన జీవరాశులలోని ఒకడు మాత్రమే అని తెలుసుకోవాలి. ఈ వాస్తవాలు రాబోవు వాదనలలో సమర్ధవంతంగా నిరూపించబడగలవు. గీతలోలాగే, ఖురాన్లో కూడా శాశ్వతమైన జీవితాన్ని పొంది, ఆకాశాలలో నివశించే జాతిని గురించి ప్రస్తావించడం జరిగింది. "శాశ్వతమైన జీవితం"అనే అంశం, చావుపుట్టుకలు లేవు మరియు స్థిరస్వరూపులు అనే విషయాన్ని గీతా 4:6 లో పేర్కొన్న దాని ప్రకారం దానంతట అదే వెల్లడైపోతుంది. మానవజాతికి పూర్వీకులైన మెదటి దంపతుల గురించి ఇక్కడ గుర్తుకు తెచ్చుకుందాము. స్వర్గం నుండి గెంటించి వేయాలనే కుట్రతో షైతాను (మాయ) వారిని ఎలా పురికొల్పాడో చూడండి.

"ఈ చెట్టు వద్దకు వెళ్లవద్దని దేవుడు శాసించింది ఎందుకంటే మీరు దేవతలలాగే అమర్త్వాన్ని పొంది శాశ్వతంగా ఉండిపోతారేమోనని" (ఖురాన్ 7:20). ఈ వాక్యాల వలన మానవుని జీవితం శాశ్వతం కాదని, దేవతలు పరలోకాలలో శాశ్వతంగా ఉండిపోయే అమరులని స్పష్టమవుతుంది. గీత మరియు ఖురాన్ ల ప్రకారం కూడా రెండు రకాలైన జీవరాశులున్నాయని తెలిసింది.

బైబిల్ : మరియు ఆకాశవస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు. ఆకాశవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 1వ కోరింధీయులకు 15:40
(దయచేసి ఇంగ్లీష్ వర్షన్ లో చూడండి)
THERE ARE ALSO CELESTIAL BODIES AND BODIES TERRISTRIAL : BUT THE GLORY OF THE CELESTIAL IS ONE AND THE GLORY OF THE TERRISTRILIS ANOTHER. - 1 CORINTHIANS 15:40

ఆ తరువాత శ్లోకంలో సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరుడు ఈ రెండు రకాల జీవులకు అతీతమైనవాడని బహిర్గతమవుతుంది.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః
యో లోకత్రయమావిశ్వ బిభర్త్యవ్యయఈశ్వరః
ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, వేరైనవాడును నాగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు -గీత 15:17

సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు ఉత్తమపురుషునిగా పరమ+ఆత్మగా వర్ణించబడ్డాడు. మన చర్చనీయాంశమైన శ్రీపరమాత్ముడే స్వయంగా సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునిగా భావించడంలో ఇదే విషయం తప్పుదోవ పట్టించింది. సందర్భానుసారంగా కొన్ని మాటలు వేరువేరు అర్ధాలు ఇవ్వడమే కాకుండా, ఒక్కొక్కప్పుడు ఈ అర్ధాన్ని ఇతర వ్యక్తులను కూడా సూచిస్తాయి. ఉదాహరణకు ఆత్మ అనే మాట సర్వసాధారణంగా మనిషిలో ఉండే అంతరాత్మకు అర్ధంగా వాడతారు. కానీ కొన్ని సందర్భాలలో ఇదే మాట వ్యక్తులను గురించి సూచిస్తుంది.

ఉదాహరణకు 
జితాత్మ = మనసును జయించినవాడు (6:7)
తృప్తాత్మ = తృప్తీని పొందినవాడు (6:8)
మహాత్మ = గొప్పవాడు (శ్రీకృష్ణుడు) (11:37)
మహాత్మ = గొప్పవాడు (అర్జునుడు) (18:74)
పరమాత్మ = పవిత్రమైనవాడు  (శ్రీకృష్ణుడు) (13:23)
పరమాత్మ = పవిత్రమైనవాడు (ఇంద్రియములను జయించినవాడు) (6:7)
కామాత్మ = ఇంద్రియ కోరికల వలన సంతృప్తి చెందగోరువాడు (2:43)
అవ్యయాత్మ = నాశనము కాకుండా ఉండువాడు (4:6)
సంశయాత్మ = సందేహము కలిగినవాడు (4:40)
మహాత్మానాః = గొప్ప గొప్ప ఆత్మలు, సత్పురుషులు (9:13)

పరమాత్ముడు అనేది శ్రీకృష్ణుని బిరుదు. ఇది ఇతని గొప్పతనాన్ని సూచిస్తుంది.  గీతలో 6:7 శ్లోకములో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనిషినుద్దేశించి ఇలా వర్ణించాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు పరమాత్ముడు. అనగా ఇంద్రియములను జయించువాడు పరమాత్ముడు. ఇక్కడ రెండు రకాల పరమాత్ములున్నారు. ఒకరు శ్రీకృష్ణుడు, మరొకరు తన మనసును అదుపులో ఉంచుకున్నవాడు. మరి ఈ ఇద్దరి వ్యక్తుల హోదాలు సమానమౌతాయా? ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసము లేదా? శ్రీకృష్ణుడు మహాత్ముడు (11:37), శ్రీ అర్జునుడు కూడా మహాత్ముడుగా (18:74) పిలువబడ్డాడు. ఇద్దరికీ మహాత్ముడనే బిరుదులు లభించినంత మాత్రాన అర్జునుడికి, శ్రీకృష్ణుడికి వ్యక్తిగత హోదా ఒకటే అవగలదా? అర్జునుడిని, శ్రీకృష్ణుడితో పోల్చవచ్చా? నిష్కల్మషమైన మనస్సుతో అనన్య మనస్కులై దేవుని ఆరాధించేవారు "మహాత్మానాః అనబడతారని గీత చెబుతుంది. ఆరాధించేవారంతా (మహాత్మానాః) అర్జునుడు లేక కృష్ణునితో సమానులవుతారా? ఈ ముగ్గురిని సమానహోదాతో చూడగలమా? మనం గొప్పవాళ్లను మహాత్ములని పిలుస్తాము. (ఉదా:- మహాత్మాగాంధీ). సర్వోన్నతుడైన ఈశ్వరుని మనం ప్రభువు అని పిలుస్తాము. కోర్టులో మేజిస్ట్రేట్ లను, జడ్జీలను "మిలార్డ్" అని సంభోధించడం మనం వింటుంటాం. కానీ ఈ జడ్జీలకిచ్చే "లార్డ్" అనే బిరుదును పురస్కరించుకుని సర్వేశ్వరుడిని, జడ్జీల హోదాను సమాన దృష్టిలో చూస్తామా? సర్వేశ్వరుని పరమాత్ముడని పిలవడం అంగీకరించవలసిన విషయమే. ఎందుచేతనంటే ఆయన ప్రతి అంశంలోనూ పరమశ్రేష్టమైనవాడు (7:7). గొప్పవాడై ఉండి పరమాత్మునిగా (గొప్ప పురుషుడు అనే అర్ధంలో) పిలవబడేవాడు ఎవడైనప్పటికీ లేక ఎవరైనా ఎవరినైనా అలా సంబోధించి పిలిచారనుకోండి లేక సర్వేశ్వరుడే స్వయంగా ఈ బిరుదును ఎవరికైనా ప్రసాదించినా వారు భువిలోని వారైనా లేక ఆకాశాలకు చెందినవారైనా, వారెవరూ ఇంకా చివరకు పరమాత్ముడు కూడా సాక్షాత్తు సర్వోత్కృష్టుడైన ఈశ్వరునితో సరిపోల్చబడరు; సర్వేశ్వరుదూ కాలేదు. 15:17 శ్లోకములో పేర్కొనబడిన పరమాత్ముదనే పదము కేవలం ఒకే ఒక్కడు సర్వోన్నతుడైన సర్వేశ్వరునికే తప్ప మరెవరికీ వర్తించాడు. మన ప్రస్తుత చర్చనీయ అంశములో ఉన్న ఆకాశలోకాలకు చెందినవాడు, సనాతన ధర్మాన్ని పునః స్థాపించడానికి నియమింపబడినవాడయిన వానికి పరమాత్మ అనే ఈ బిరుదు సందర్భానుసారం ఇక్కడ వర్తించనే వర్తించదు. సరిగా చెప్పాలంటే శ్లోకము 15:17 లోని పరమాత్ముడు (సర్వేశ్వరుడు) మరియు 15:16లోని అక్షర తరగతికి చెందిన పరమాత్ముడు వీరిద్దరూ ఒకే వ్యక్తిత్వం గల వారు కారు. రాబోవు వాదనలు ఈ అంశాన్ని ఇంకా స్పష్టంగా విశదీకరిస్తాయి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తాను సర్వజీవ రాశులకంటే, వారు ప్రపంచములోని వారైనా పరలోకమందలి దేవగణములైనా వారందరి కంటే అతీతమైన, ఉన్నతమైన, ప్రత్యేకమైన వ్యక్తిత్వము కలిగియున్నానని వేరొక శ్లోకములో చెబుతున్నాడు.

యస్మాత ర మతీతో హమాక్షరాదపి చోత్తమః
అతోస్మి లోకేవేదే చ ప్రధితః పురుషోత్తమః
నేను క్షరస్వరూపుని కంటే మించినవాడను, అక్షర స్వరూపునికంటే శ్రేష్టుడను అయి యున్నందువలన ప్రపంచమునందును, వేదము నందును "పురుషోత్తము"డని ప్రసిద్ధికెక్కి యున్నాను. - గీత 15:18 
Next Page : 6
Share:
spacer

No comments:

Post a Comment