2.పరమాత్మ - అర్జునుడు ఒకరికొకరు అపరిచితులు

కురుక్షేత్రము
కురుక్షేత్రము అంటే ఒక పవిత్ర స్థలము లేక పుణ్యక్షేత్రము. దీనికి ధర్మక్షేత్రము అనే మరొక పేరు కూడా ఉంది. ధరాన్ని పునఃస్థాపించడానికి ప్రమాత్ముడు, జీవాత్ముని (ప్రవక్త అర్జునుని)తో మొదటిసారిగా కలసిన ప్రదేశము, శ్రీ పరమాత్ముని చేత ధర్మం బోధించబడింది కాబట్టి ఇది ధర్మక్షేత్రం అనబడుతుంది.
(కురుక్షేత్రమునకు మరొక అర్ధం కురు=చేయు, క్షేత్రము=స్థలము. ముఖ్యంగా దీని అంతరార్ధం కర్మలను ఆచరించు స్థానముగా ఈ ప్రపంచమునకు వర్తిస్తుంది.)

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధర్మం బోధించిన స్థలం కురుక్షేత్రం - గీత 1:1

కురుక్షేత్రం లేక ధర్మక్షేత్రంలో శ్రీ పరమాత్ముడు తన మొదటి కలయిక (యోగము)లో అర్జునునికి ఏవిధంగా కనిపించాడో ఈక్రింది శ్లోకము తెలుపుతుంది. శ్రీ పరమాత్ముని చూసి అర్జునుడు ఇలా అడిగాడు.

ఆఖ్యాహి మేకో భావానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద
విజ్ఞాతుమిచ్చామి భవన్తమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్.
దేవోత్తమా! భయంకరాకారముగల మీరెవరో నాకు చెప్పుడు. ఏలయనగా మీ ప్రవృత్తిని ఎరుంగకున్నాను. మీకు నమస్కారము. నన్ననుగ్రహింపుడు. -గీత 11:31

శ్లోకము 11:31 లోని "భయంకరాకారము గల నీవు" అనే మాటలను బట్టి శ్రీ పరమాత్ముడు బహుశా నాలుగు చేతులు కలిగి ఉన్న ఒక అసాధారణ మానవరూపంలో అర్జునునికి కనిపించాడు. ఆ ఆకారాన్ని మొదటిసారి చూసినప్పుడు అర్జునుడు మనస్సులో కాస్తంత భయంతో తడబడ్డాడు. క్రింది శ్లోకం ఆ విషయాన్ని బహిర్గతం చేస్తుంది.

కిరీటినం గదినం చక్రహస్త మిచ్చామి త్వాం ద్రష్టుమహం తధైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భావ విశ్వమూర్తే.
నేను మిమ్మల్ని మునపటివలెనే కిరీటము, గదా, చక్రము చేత ధరించిన వానిగ జూడలంచుచున్నాను. అనేక హస్తములుగలవాడా! జగద్రూపా! నాలుగు భుజములు గల ఆ పూర్వరూపమునే మరల ధరింపుడు. - గీత 11:46

శ్రీ పరమాత్ముని విశ్వరూపం ఎక్కువసేపు చూడలేకపోయిన అర్జునుడు మరల వెనుకటి నాలుగు చేతులతో కూడిన రూపాన్నే చూపమని శ్రీ పరమాత్ముని వేడుకున్నాడు. నాలుగు చేతులు కలిగియున్న ఈ ఆకారము మొదటి చూపులో కాస్త భయం కలిగించేదిగా ఉన్నా, విశ్వరూపమంత భయంకరంగా లేదు కానీ ఒక విధమైన ఆనందానుభూతిని కలిగించింది. కనుక ఆ ఆకారాన్ని మరల చూడాలనే కోరిక అర్జునునికి అతి స్పష్టంగా కనిపించి ఉంటాడు. తాను (పరమాత్ముడు) సాధారణ మనిషిని కానని మానవజాతికి అతీతుడనే విషయాన్ని అర్జునుని మనస్సుపై ముద్రవేసి అతనిని విశ్వసింపజేయడానికి అలా చూపడం జరిగింది.

1.నీవు ఎవరు? 2.నీవు నిర్వర్తించవలసిన కార్యమేమిటి? (నీ ప్రవృత్తి ఏమిటి?)

పై రెండు ప్రశ్నలు శ్రీ పరమాత్మునితో అర్జునునికి ఇంతకుపూర్వం పరిచయం లేదని ఈ అసాధారణ రూపంలోనే అర్జునునితో సమావేశం అవడం ఇదే ప్రధమమనే విషయాన్ని తెలుపుతోంది. ఇంకా ఈ అసాధారణ రూపం కలవాడు వాస్తవానికి ఎవరై ఉంటాడు? ఇతడు నిర్వర్తించే కార్యమేమిటి? అనే విషయాలు తెలుసుకోవాలనే కోరిక అర్జునుని మనస్సులో కలిగినట్లు స్పష్టం అవుతుంది.

పరమాత్మ ప్రవక్త ముహమ్మద్ వారిని కలిశాడు.

జీబ్రయీల్ (గాబ్రియేల్)ను ముహమ్మద్ ప్రవక్త మొదటిసారి చూసినప్పుడు ఆయనకు ఇంచుమించు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాంతి పర్వతం (జబలే నూర్)పై జిబ్రయీల్ వారు ఈ అసాధారణ రూపంలోనే ముహమ్మద్ ప్రవక్తకు మొదట దర్శనమిచ్చాడు. హిందూ ధార్మిక గ్రంధాలలో జిబ్రయీల్ కు పేర్కొన్న పేరు పరమాత్ముడు. కాంతి పర్వతంపై జిబ్రయీల్ అసాధారణ రూపంలో ముహమ్మద్ ప్రవక్త వారిని ఉద్దేశించి తన అధికారికమైన స్వరంలో ఇలా ఆదేశించాడు:

పఠించు సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు, నీ ప్రభువు పరమ దయాళువు. ఆయన కలామ్ ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. - ఖురాన్ 96:1-5

అప్పటికి ముహమ్మద్ వారు ప్రవక్తగా ఇంకా నియుక్తులు కాలేదు. ఆయన నివాస ప్రాంతం నుండి దూరంగా కాంతికొండ (జబలెనూర్) వద్దకు పోయి ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేసుకునేవారు.

ధర్మం ప్రప్రపధంగా కురుక్షేత్రంలో బోధింపబడుట చేత అది ధర్మక్షేత్రంగా పిలువబడింది. అదే విధంగా మొదటిసారి దైవసందేశం ఇక్కడినుండే రావడం మొదలయింది. ఈ కాంతిపర్వతం వద్దనే పరమాత్ముడు*, ప్రవక్త ముహమ్మద్ కు దర్శనమిచ్చి ఆయన (ముహమ్మద్) పై దైవ సందేశాన్ని అవతరింపజేసాడు. కాబట్టి ఈ పర్వతము జబలెనూర్ (కాంతిపర్వతం)గా పిలువబడింది. ఈ జబలెనూర్ నుండే అపురూప దైవ సందేశ కిరణాలు వెలువడి, అంధకారంలో కొత్తిమిట్టాడుతున్న ప్రపంచమంతా వెదజల్లబడ్డాయి. కురుక్షేత్రంలో అర్జునుడివలే, "నీవు ఎవరవు?, నీ కార్యమేమిటి? అనే ప్రశ్నలు వేయనప్పటికీ, ఆ అపరిచిత ఆకారారపు దర్శనమేమిటో ఆయన ఇవ్వబోయే సందేశమేమిటో అని ముహమ్మద్ ప్రవక్త తీవ్రంగా కలవరపడ్డారు.
.......................................
పరమాత్ముడు* : ఖురాన్ ప్రకారంగా రూహుల్ ఖుద్దుస్ అని అతని బిరుదు. రూహ్ + ఖుద్దూస్ = రూహుల్ ఖుద్దుస్.
రూహ్ = ఆత్మ, ఖుద్దుస్ = ప్రవిత్రమైన. పవిత్రమైనటువంటి ఆత్మ = పరమాత్మ, (ఖురాన్ 5:110, 2:87) ఖురాన్ లో ఆయనకు మరొక బిరుదు ఉన్నది. అది "రూహుల్ అమీన్" అనగా విశ్వననీయమైన ఆత్మ అని అర్ధం (ఖురాన్ 26:193).
spacer

1.యోగము - దాని వాస్తవికత | Yogamu - Its Reality

yogamu-its-reality
యోగము - దాని వాస్తవికత | Yogamu - Its Reality
యోగము - దాని వాస్తవికత | Yogamu - Its Reality
సర్వేశ్వరుడే స్వయంగా మానవరూపంలో డీడీ రావడాన్ని అవతారం అంటారు. మానవునిపై మాయగాడి పైశాచిక , షైతాని ప్రలోభాల ప్రభావం ఎక్కువైపోయి మానవులను ఏకేశ్వరోపాసన నుండి బహుదైవారాధన వైపునకు త్రిప్పడంలో అవతారము అనేది ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది.

మనిషిలో సమగ్రమైన గ్రంధావగాహనం లోపించ్డమ్ వల్లనూ, ఒక దానిని మరొకటిగా భ్రమించటం వల్లనూ పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు మతములో చోటు చేసుకుంటాయి.

యోగము : గీతాలోని అధ్యాయాలకు, విషాదయోగము, సాంఖ్యయోగము అని ఇలా వరుసక్రమంలో పేర్లు పెట్టి గీతను మొత్తం పద్దెనిమిది యోగములుగా విభజించారు.

ప్రస్తుత సందర్భాన్ని బట్టి "యోగము" అంటే "కలయిక" అని అర్ధం. దీనిని సాహిత్యపరంగా తీసుకున్నా ఇదే అర్ధం వస్తుంది. అయితే ఈ కలయిక ఎవరితో? శ్రీ విద్యాప్రకాశానందగిరి, కాళహస్తి వారు గీతా పరిచయంలోని "విషాదయోగము"లో ఈ విధంగా చెప్పారు : "యోగము అనగా కలయిక, జీవాత్మ పరమాత్మల కలయికయే యోగము" (గీతామకరందం)

ఈ భావము ఈక్రింది శ్లోకములో చదువవచ్చు.
"...తదాయోగం అవాప్స్యసి.." (తదా = అప్పుడు, యోగము=కలయిక, అవాప్స్యసి=నీవు పొందగలవు) అప్పుడు నీవు కలయిక పొందగలవు (2:53)

"తిరిగి ఎప్పుడు, ఎలా నీతో కలవడం జరుగుతుంది?" అని అర్జునుడు పరమాత్ముని ప్రశ్నించినప్పుడు, ఆయన పై శ్లోకము ద్వారా అతనికి వివరించి ఉంటారు.

శ్రీపరమాత్ముడు అర్జునునికి కొన్ని షరతులు వివరించి వాటిని నెరవేర్చగలిగినప్పుడు తిరిగి తనతో కలవడం సంభవమవుతుందని వివరించాడు. ధర్మాన్ని ప్రబోధం చేయడానికి ఏ జీవాత్మతోనైనా పరమాత్మ కలవడాన్ని యోగమంటారనేది స్పష్టమైంది. శ్రీ పరమాత్ముని ద్వారా ప్రోక్తమైన (బోధించబడిన) విషయాలు కూడా దైవ సందేశమైన "జ్ఞానము"నకు మారుగా "యోగము" అనబడుతూంది. అందుకే గీతాలోని అధ్యాయాలకు దైవసంబంధమైన జ్ఞానోదయానికి సంకేతముగా యోగములు అని పేరు పెట్టడం జరిగింది.

అర్జునుడు పరమాత్మునితో ఇలా అంటాడు.
...యః అయం యోగస్త్వయాప్రోక్తః - గీత 6:33
నీవు ప్రోక్టించిన యోగము

క్లుప్తంగా చెప్పాలంటే శ్రీ పరమాత్ముడు బోధించిన దైవ సందేశాలను యోగము అంటారనే విషయం ఈ శ్లోకము కూడా స్పష్టముగా అంగీకరిస్తుంది.
...యేతద్గుహ్యతమం పరమ్
యోగం యోగేశ్వరా...

నేను అతిరహస్యమైనదియు, మిగుల శ్రేష్టమైనదియునగు ఈ యోగా శాస్రమును స్వయముగానే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుని వలన ప్రత్యక్షముగా వింటిని. గీత 18:75

ఈ సందర్భముగా యోగము గురించి పతంజలి వారి తత్వశాస్రము (Philosophy)లో చెప్పబడిన నిర్వచనము గమనించదగినది. ఈ క్రింద చూడండి.

సర్వోన్నతుడైన సర్వేశ్వరుని సాన్నిధ్యములో మానవ మోక్షమునకు అవసరమైన మార్గములను బోధించుటయే "యోగము" యొక్క ముఖ్య లక్ష్యమై యున్నది. దీని ద్వారానే సర్వేశ్వరుని ఉనికి తెలియదగును... సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని ఉనికిని మరియు ఆయన విధించిన అధికారపు ఆజ్ఞలను తెలుసుకోవడానికి ఈ యోగమును అవశ్యము గావించటం ఎందుకు జరిగింది.? అన్న సంశయము కూడా కలుగవచ్చు. బ్రహ్మ (సృష్టికర్త, సర్వేశ్వరుడు) అనేవానిని సంపూర్ణముగా అవగాహన చేసుకోవడం చాలా కష్టం. నేరుగా ఆయనను చూడనూలేము మరియు గ్రహించనూలేము. ఎందుకు? ఎందుకంటే అక్కడి వరకూ అనగా ఆయన అస్తిత్వము (person) వద్దకు మన చూపు వెళ్లలేదు. ఆయన మన కనుచూపు మేరలో ఉండువాడు కాడు (కేనోపనిషత్తు 1-3) మన కనుచోపు మేరలో ఉండువాడు కాడు - ఎవడునూ ఆయనను చర్మచక్షువులతో చూడలేడు. (OP. Cit 4-11, 6-9, 4-20)

చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మద్రష్ట, సర్వజ్ఞాని - ఖురాన్ 6:103
ఎవడును, ఎప్పుడైనను దేవుని చూడలేదు. - బైబిల్ యోహాన్ 1:18

సర్వశక్తి సంపన్నుడు అయిన సర్వేశ్వరుని సకల గుణాలు, సర్వలక్షణాలతో సహా తెలుసుకోగలిగి, మోక్షము పొందడానికి కావలసిన ఉపదేశములను తెలుసుకోవడానికి గాను ఆగమం (ఆరోహణ-Descent) మరియు ప్రోక్తం (యోగము - revelation) అనేవి అనివార్యమయ్యాయి. ఈవిధముగా ఆగమం మరియు ప్రోక్తం (యోగము) యొక్క ఆవశ్యకతను గురించి తెల్పిన విషయము ఖురాన్ కూడా ధ్రువపరుస్తుంది.

ఈ సందర్భముగా విద్యారణ్యవారు తమ "INTRODUCTION TO THE STUDY OF UPANISHADS"లో ఇలా వ్రాశారు.
ఆగమము - ప్రోక్తముల విషయానికొస్తే ఆచార కర్మలను తెలుపు భాగము ఫలముల గూర్చియు మరియు వాటిని ఏ విధముగా సాధించగలమో బోధించును గనుక ఆ భాగము నుండి బ్రహ్మజ్ఞానము పొందవచ్చునను ఆశను వమ్ము చేయుటకు ఎట్టి ఆధారమును లేదు.

దైవిక సంబంధిత విషయాలకొస్తే "ఆగమము" లేక "ప్రోక్తము" అనేవి లభించకపోతే మనిషికి బ్రహ్మజ్ఞానము లభించే అవకాశము ఏ కోశానా లేదు అని పై అభిప్రాయము యొక్క తాత్పర్యముగా భావించవచ్చు.

ఆగమము (అవరోహణము) మరియు ప్రోక్తమ్ REVELATION ప్రాప్తికాకుండా మోక్షము పొందడానికి మూలకారణమైన బ్రహ్మ ఉనికి, ఆయన బోధనలు, శిక్షా బహుమానాలు ఏమిటో అసలు మనకు తెలియనే తెలియవు అని స్పష్టమవుతూంది. నిజానికి సర్వ శక్తుమంతుడైన సర్వేశ్వరుడు మానవజాతిని సృష్టించినప్పటినుంచి ఎడతెగకుండా అపురూపమైన దైవమార్గాలను చూపుతూనే ఉన్నాడు. అవసరాన్ని బట్టి కాలానుగుణంగా ఆ మార్గాన్ని తిరిగి చైతన్యవంతం చేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ క్రింది శ్లోకాలను పరిశీలించవచ్చు.

లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్.
పాపరహితుడవగు ఓ అర్జునా! పూర్వ మీలోకమున సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను రెండు విధములగు అనుష్ఠానము నాచే చెప్పబడియుండెను. - గీత 3:3

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్.
ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః
స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప.
నాశరహితమగు ఈ యోగమును పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ ప్రకారముగా పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొనిరి. చాలా కాలం గడిచి నందున ఆ యోగమిపుడీ లోకమున అదృశ్యమైనది. -గీత 4:1,2

స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః
భక్తోసి మే శాఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్.
నీవు నా భక్తుడుగను, మిత్రుడుగను నున్నవు కావున ఆ పురాతనమైన యోగమునే ఇపుడు తిరిగి నీకు జెప్పితిని. అది మిగుల శ్రేష్ఠమైనదనియు, రహస్యమైనదనియు నెరుంగుము.  - గీత 4:3    

యోగమంటే పరమాత్ముని అవతరణ మరియు ధర్మాన్ని బోధించడం అని తెలిసింది. ఆగమము మరియు ప్రోక్తం రెండూనూ అటు "ఖురాన్" మరియు ఇటు "గీత" ప్రకారంగా "యోగము" అని గుర్తించబడినాయి.
spacer