4. యోగేశ్వరుడు - మానవకోటి జ్ఞానోదయం కొరకు నియుక్తుడైనవాడు

4-yogeshwara-man-who-is-enlightened-man-for-enlightenment
4. యోగేశ్వరుడు - మానవకోటి జ్ఞానోదయం కొరకు నియుక్తుడైనవాడు
4. సమస్త ప్రాణులకు ప్రభువు
"భూతానామ్ ఈశ్వరోపినన్"  భూతానామ్ = జన్మించిన సమస్త ప్రాణికోటి , ఈర్వర = ప్రభువు

పుట్టిన ప్రతి జీవికి తాను ప్రభువునని ప్రమాత్ముడు వివరించాడు. ప్రస్తుత చర్చనీయాంశ విషయానికి వస్తే "భూతానామ్ ఈశ్వరః" అనే వాక్యానికి సమస్త మానవ జాతికి ప్రభువని అర్ధం. "భూతానామ్" అనేది ఇక్కడ ప్రత్యేకంగా మానవజాతినుద్దేశించే చెప్పబడింది. అయితే ధార్మిక గ్రంధాల ఆధారము లేకుండా ఇది ఎలా చెప్పగలరు? అని అడగవచ్చు. దీనికి మా వివరణ ఏమిటంటే -"జన్మించని పరమాత్ముడు " "జన్మించిన వారందరికీ తాను ప్రభువు"ను అని చెప్పిన పలుకులు మానవరూపం దాల్చి చెప్పినవి. ఒక పుట్టుకలేని జీవి మానవ ఆకారంలో వచ్చి తాను పుట్టే వారందరికీ ప్రభువునని తనను పరిచయం చేసుకుంటున్నాడంటే "మానవులకు ప్రభువునని మాత్రమే కాని వేరే జీవులకు కాదని చెప్పినట్లు స్పష్టమవుతుంది. పైగా యోగాభ్యాసము చేయవలసిన అవసరం మానవునికి తప్ప ఏ ఇతర జీవికి కూడా లేదు. కనుక ప్రమాత్ముడు మానవజాతికి మాత్రమే ప్రభువు (యోగేశ్వరుడు). యోగేశ్వరుడు అనేది పరమాత్మకు మరొక పేరు (గీతా 11:4,9)

పరం యోగం యోగేశ్వరః
పరం =  సర్వోత్కృష్టమైన, పరమ శ్రేష్టమైన 
యోగం = ప్రోక్తించబడిన జ్ఞానం
యోగేశ్వరః (యోగ+ఈశ్వర) = యోగమునకు లేక జ్ఞానబోధకు ప్రభువు

వ్యాసప్రసాదాచ్చుతవా నేతద్గుహ్యాతమం పరమ్
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్క థయతస్స్యయమ్. గీత 18:75
శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహమువలన, నేను అతి రహస్యమైనదియు, మిగుల శ్రేష్టమైనదియునగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుని వలన ప్రత్యక్షముగా వింటిని. 

కాబట్టి ఈ రెండు క్లాజులు అనగా 4:6 యొక్క "భూతానాం ఈశ్వరః" మరియు 18:75 యొక్క "యోగేశ్వర" అనే మాట సమస్త మానవజాతికి జ్ఞానోదయాన్ని కలిగించే గురువు శ్రీపరమాత్ముడని నిరూపిస్తున్నాయి. అయితే జ్ఞానోదయాన్ని ప్రసాదించడానికి స్వర్గలోకాల నుండి ఈయన రాక కేవలం భారతదేశానికే పరిమితం కాదు అని ఇంకా ఆయన రాకడ ఉద్దేశం యావత్ ప్రపంచంలో మనుగడ సాగించే సమస్త మానవజాతికి జ్ఞానోదయం కలిగించడం అని విశదమౌతుంది. ఎయా కారణంగానే ఆయన జగద్గురువుగా పేరు గాంచాడు. (11:43). ఇది "భూతానాం ఈశ్వరః" అనే మాటకు సరియైన అర్ధం. ఆయన సర్వమానవజాతికి యోగము ప్రసాదించే ప్రభువుగా గాక విశ్వంలోని సర్వస్వానికి ప్రభువుగా ప్రజలు అపోహలు పడుతున్నారు. ఈ విధంగా యోగేశ్వరుడిని లోకేశ్వరుడిగా, సర్వేశ్వరునిగా భ్రమపడి ఈశ్వరత్వం ఆయనకు ఆపాదించడం జరిగింది.
Share:
spacer

No comments:

Post a Comment