3.పరమాత్ముని అవతారాన్ని సర్వేశ్వరుని అవతారంగా భ్రమించడం జరిగింది

incarnation-of-paramatma-was-incarnated

"ఇంత భయంకర ఆకారము గల మీరు ఎవరు?" మరియు "మీ ప్రవృత్తి ఏమిటి?, మిమ్మును గూర్చి తెలిసికొన గోరుచున్నాను" అనేవి మూడు సందేహాలు

అర్జునుడు శ్రీ పరమాత్మున్ని సర్వేశ్వరునిగా భావించడం లేదనే విషయాన్ని ఈ రెండు ప్రశ్నలు ధ్రువపరుస్తున్నాయి. అర్జునుడు అతనిని సర్వేశ్వరునిగా గుర్తించి ఉంటే "నీవు ఎవరవు? నీ ప్రవృత్తి ఏమిటి?" అని ప్రశ్నించి ఉండేవాడు కాదు. అయినా దేవోత్తమా ఆది పురుషుడు, నీకు నమష్కారము, నన్ననుగ్రహింపు (11:31) వంటి మాటలు పరమాత్ముడి స్థాయిని సర్వేశ్వరుని స్థితికి తీసుకువెళ్లడానికి చేసిన మానవ విఫలయత్నంగా అద్దం పడుతున్నాయి. అర్జునుని ప్రశ్నకు శ్రీ పరమాత్ముడు సాధారణ మానవరూపంలో ఈ క్రింది విధంగా సమాధానం చెబుతాడు.

అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా.
నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముగలవాడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరచుకొని నా మాయశక్తి చేత పుట్టుచున్నాను. - గీత 4:6

పై శ్లోకములో నాలుగు అంశాలు (గుణాలు) కనిపిస్తాయి. అవి మానవ ఆకారములోనున్న శ్రీ పరమాత్ముడి అసలు వ్యక్తిత్వాన్ని స్పష్టపరుస్తాయి.

1. జన్మరహితమైనది. 2.నాశనము లేనిది. 3. మానవాకారముగా అవతారము పొండాగాల స్వయంశక్తి సామర్ధ్యాలు కలిగి ఉండేది. 4. సమస్తజీవులకు ప్రభువు. 

1.అజః (జన్మరహితుడు) : పుట్టుకలేనివానికి మరణం అనే ప్రశ్నే తలెత్తదు కాబట్టి అలాంటివాడు మరణం సంభవించే సామాన్య మానవుడిలా జన్మించడు. జనన మరణాలకు అతీతంగా మనిషే ఉండడు. అందుకే జనన-మరణములు లేని పరమాత్ముడు ఏవిధంగానూ మానవుడు కాలేడు. సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునికి ఈ గుణాలు ఉన్నాయని గ్రంధాల (Scriptures) ద్వారా తెలిసింది. కనుకనే ఈ అంశం ద్వంద్వార్ధలకు దారి తీసి అపోహలకు  ప్రధాన కారణమైంది. అది కాలక్రమేణా (మానవరూపంలో వచ్చిన) పరమాత్ముని అవతారాన్ని ఈశ్వరావతారమని నమ్మించి చివరకు పరమాత్ముడంటేనే సర్వేశ్వరుడనే అపోహకు దారి తీసింది.

2. అవ్యయాత్మ : నశింపనివాడు (నాశనము లేనివాడు) :శించేగుణం లేని లేక ఎటువంటి మార్పులు చెందనిది. ఈ గుణము మానవనైజానికే వ్యతిరేకము. ఎందుకంటే మానవుడు ముందు పసివానిగా జన్మిస్తాడు. క్రమేణా బాల్యదశకు, ఈ బాల్యము యవ్వనదశకు మారుతుంది. ఈ విధంగా మానవ శరీరము ఒకదశ నుండి మరొక దశకు మారిపోతుంది. ఇక్కడ నుండి క్షీణదశ ప్రారంభం అవుతుంది. క్రమేపీ వృద్దాప్యానికి చేరుకుని చివరకు మనిషి మరణిస్తాడు.

    పరమాత్ముని గురించి చెప్పాలంటే ఆయన తన గురించి చెప్పుకున్నట్లు ఆయనకు తనదంటూ ఒక స్వరూపం ఉంది. అది పైన వర్ణించిన నశించే గుణాలు మార్పులూ లేకుండా ఉంటుంది. ఈ భేదాలను అవగాహన చేసుకుంటే, పరమాత్ముడు మానవ మాత్రుడు కాడని తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడే. అందువలన శ్రీ పరమాత్మునికి దైవత్వం ఆపాదించడంలో ఈ అంశం కూడా బలం చేకూర్చింది. అంటే సర్వేశ్వరుడే స్వయంగా శ్రీ పరమాత్మునిగా అవతారము ఎత్తుతాడనే భ్రమ కలగడానికి కారణమైంది.

జన్మించినవాడు అవతారము కాజాలడు
సంభవామి = నేను అవతారమును పొందుదును, నేను ప్రత్యక్షపరచు కొందును.

3. అవతారము = మానవ రూపము దాల్చడం : పుట్టుకలేనివాడు మార్పులు చెందని శరీరముతో ఉన్నవాడు. ఇలా అంటే ఆయన ఆకాశమునుంచి భూమిపై మానవశరీరముతో దిగి వస్తేనే గాని అది సాధ్యపడదు.

అవతారము పొందేవానికి రెండు శరీరాలు ఉంటాయని మనము గ్రహించాలి. ఒకటి అతని సొంత శరీరము, మరొకటి అవతారము పొందిన శరీరము. అయితే అవతారములో ఉన్న శరీరము తన పని ముగించుకుని తిరిగి సొంత శరీరముగా మారినప్పుడు అవతారములో కనిపించిన శరీరము మాయమయిపోతుంది. ఈ విధముగా ఆయన ఎన్ని అవతారాలు ఎత్తిగా ఉండేది మాత్రం తన స్వంత అస్తిత్వములోనే అది తన సహజ స్వరూపములోనైనా ఉంటుంది. లేదా అవతారరూపంలోనైనా ఉంటుంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన జనుల మధ్యనే సంచరిస్తూ ఎవరికీ కనబడకుండా ఉండగల సామర్ధ్యము కలిగి ఉన్నవాడు.

మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన అతి సూక్ష్మమైన రూపంలో ప్రవక్త హృదయంలోనికి తిన్నగా ప్రవేశింపగలదు. అంటే అణువుకంటే సూక్ష్మంగా మారి ప్రవక్త హృదయంలో ఈశ్వరజ్ఞానాన్ని అంకురింప జేస్తాడు. దీనినే ఆత్మ+జీవాత్మల కలయిక అంటారు. ఆయన ఏ పరిస్థితులలో ఏ రూపంలో ఉన్నా ఆయనకున్నది ఒకే ఒక సహజ స్వరూపం. అందుచేత తన సహజత్వం గురించి, తన స్వభావాలను, గుణాలను వివరించి చెప్పినడాని ప్రకారం చూస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఆ గుణాలు మానవులకు అన్వయింపవు. "సంభవామి ఆత్మ మాయయా" " నా స్వయం మాయాశక్తితో అవతరింతును" కాబట్టి ఈ "సంభవామి ఆత్మ మాయయా" అనే షరతు పరమాత్ముడు మానవరూపంలో ఆకాశము నుండి దిగివచ్చినవాడే కానీ, ఏ కాలంలోనూ ఏ మానవ గర్భకోశము నుండి కూడా జన్మించినవాడు కాదు. పరమాత్మ జన్మించడు గాని తాను కోరిన రూపములో దర్శనమిస్తాడు అనే సత్యాన్ని ఈ విషయం చాలా స్పష్టంగా వివరిస్తుంది.

ఈ సత్యం వెలుగులో తేవడానికి గీతే సాక్షాధారం. శ్రీ పరమాత్ముడు మూడు వేరువేరు రూపాలలో కనిపించాడు.
1.అసాధారణమైన నాలుగు చేతులు కలిగి ఉంది అర్జునునికి మొదట సాక్షాత్కరించిన మానవరూపము.
2.తరువాత సామాన్య మానవరూపంలో కనిపించింది.
3 అర్జునుని కోరిక మేరకు అతనికి చూపించిన విశ్వరూపం. ఇదే తనదైన అసలు సహజసిద్దమైన స్వరూపం (11:47)

ఇప్పుడు ఒక వాస్తవాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. అర్జునుడు విశ్వరూపాన్ని చూసినప్పుడు చాలా భయంకంపితుడయ్యాడు. ఇకపై చూడలేక దీనికి ముందు చూపించిన అసాధారణ చతుర్భుజ మానవ రూపాన్నే చూపమని శ్రీ పరమాత్ముని వేడుకున్నాడు. (11:49). పరమాత్ముని ఆ భయంకరమైన విశ్వరూపం నాలుగు చేతులు గల అసాధారణ మానవరూపముగా ఆ తరువాత సామాన్యమైన మానవ రూపంగా మారిపోయింది.

ఇలా రూపాలను మార్చి భూమి మీదకు అవతారం పొందడం అనేది ఏ మానవ మాత్రునికి సాధ్యం కాదు. పరమాత్ముడు కోరిన రూపాన్ని తన ఇష్ట ప్రకారం పొండాగాల సామర్ధ్యం కలిగి ఉన్నాడని దీని వలన తెలిసింది. "సంభవామి యుగేయుగే" (4:8). ఆయన ఆకాశాల నుండి దిగి వచ్చేవాడు కాబట్టి ఆయన ఏ కాలములోనూ, ఏ స్త్రీ గర్భము నుంచి కూడా జన్మించలేదని, రాబోయే కాలంలో కూడా అలా జన్మించాడనే విషయాన్ని ఈ అంశం అతి స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. అయితే ఆయన ఎలా వస్తాడు? ఆయన మానవ ఆకారంలో స్వర్గలోకాల నుండి దిగి వస్తాడు. నిజానికి స్త్రీ గర్భం నుండి పుట్టడం అనే విషయం ఆయన పరమ లక్షణాలకు విరుద్దమైనది. ఎందుచేతనంటే ఈయన ఎవరి వలన జన్మించినవాడు కాదు, ఎటువంటి మార్పులు చెందకుండా స్థిరంగా శాశ్వతంగా ఉండేవాడు. పుట్టుకకు లోనైన ప్రతీ మానవుడూ వివిధ దశలుగా మార్పులు చెండాలి. అలా చివరికి అతను మృత్యువాత పడాలి (2:13,27)అనేది వాస్తవం. దీనిని బట్టి మరో విషయం నిరూపణ కాగలదు.

అదేమిటంటే స్త్రీ గర్భం నుండి జన్మించి ఉన్నవారు ఎవరూ అవతారపురుషులు కాలేరు. అనగా మానవగర్భం నుండి జన్మించిన వానికి తాను అవతరించినవానిగా చెప్పుకునే హక్కు లేదు. మానవులెవరూ అవతారా పురుషులు కాజాలరు అనే యధార్ధాన్ని ఈ అంశము నిరూపిస్తుంది. కనుక మానవుని వలన జన్మించినవారు దేవుని అవతారము అనే వాదన వీగిపోయింది. మానవజన్మ నెత్తినవాడు, నేను అవతారాపురుషుదానాని వాదిస్తే వాడు మోసము చేస్తున్నాడని సులువుగా అర్ధమయి పోతుంది. ఇటువంటి వారిని దేవుని అవతారాలుగా భావించే వారు మాయలో పడ్డారని అర్ధం చేసుకోవాలి.
Share:
spacer

No comments:

Post a Comment